
బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ
హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. బుధవారం హనుమకొండ నయీంనగర్‌లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్‌గా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్‌ను రాష్ట్ర కమిటీ ప్రకటించింది. కాగా, వర్కింగ్ చైర్మన్‌గా దొడ్డిపల్లి రఘుపతి, వైస్ చైర్మన్లుగా దాడి మల్లయ్య, బొనగాని యాదగిరి గౌడ్, వైద్యం రాజగోపాల్, తమ్మెల శోభారాణి, కోఆర్డినేటర్లుగా తంగళ్లపల్లి రమేశ్, గాజ యుగంధర్ యాదవ్‌తో కమిటీ ఏర్పాటైందని చైర్మన్ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. ఈ నెల 18న నిర్వహించనున్న రాష్ట్ర బీసీ బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
ఖానాపురం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని అశోక్‌నగర్‌లో చోటుచేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ జంపయ్య కథనం ప్రకారం.. నర్సంపేట మండలం ఇటుకాలపల్లి జీపీ పరిధిలోని నర్సింగాపురం గ్రామానికి చెందిన పల్లకొండ రాజేందర్(43) బైక్‌పై మంగళవారం రాత్రి ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో బంధువుల ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో సైనిక్‌స్కూల్ దాటిన తర్వాత బైక్ రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది. గమనించిన వాహనదారులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య సునీత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడు అభిషేక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ జంపయ్య తెలిపారు.
బైక్‌లు ఢీకొని దొడ్లగడ్డ
తండాలో చిన్నారి ..
నర్మెట: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన బుధవారం మండలంలోని దొడ్లగడ్డ తండాలో చోటు చేసుకుంది. తరి గొప్పులకు చెందిన చెన్నబోయిన శివుడు తన భార్య శైలజ, కూతురు శ్రీవిద్య(03)తో కలిసి బైక్‌పై జనగామ నుంచి తరిగొప్పులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ మండలంలోని దొడ్లగడ్డ తండాలో వీరిని ఢీకొంది. ఈ ఘటనలో శ్రీవిద్యకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో 108లో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
దరఖాస్తు చేసుకోవాలి
కాళోజీ సెంటర్: విద్యాశాఖలోని బోధన, బోధనేతర ఇబ్బందికి జీఓ 317 ప్రకారం ఇంటర్ లోకల్ క్యాడర్ తాత్కాలిక బదిలీలు, డిప్యుటేషన్ల కోసం ఈనెల 17 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్‌నికోలస్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. schooledu.telangana.gov.inలో దరఖాస్తు చేసి సంబంధిత కాపీలను ఆర్‌జేడీ, డీఈఓలకు సమర్పించాలని పేర్కొన్నారు. వివరాల కోసం 8523030307 సంప్రదించాలని సూచించారు.

బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ