
సీపీఆర్‌తో మనిషిని బతికించే అవకాశం
ఎంజీఎం: అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ వెంటనే చేయడం ద్వారా మనిషిని బతికించే అవకాశాలు పెరుగుతాయని కేఎంసీ స్కిల్ సెంటర్ నోడల్ ఆఫీసర్ చిలక మురళి అన్నారు. సీపీఆర్ వారోత్సవాల్లో భాగంగా కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో బుధవారం సీపీఆర్‌పై అవగాహన నిర్వహించారు. ఈసందర్భంగా హాస్పిటల్‌లో ఉన్న అన్ని తరగతుల ఉద్యోగులు, పేషెంట్ బంధువులు, ఆటో డ్రైవర్లకు సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్ బాలరాజు, ఆర్‌ఎంఓ ప్రతాప్, డాక్టర్ రోషన్, అనస్తీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ నాయక్, డాక్టర్ కరిష్మా తదితరులు పాల్గొన్నారు.
కేఎంసీ స్కిల్ సెంటర్ నోడల్ ఆఫీసర్ మురళి