
ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన పోలీసులు
ఖిలా వరంగల్: వరంగల్ ఎస్‌ఆర్‌ఆర్‌తోట చిన్న బ్రిడ్జి వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న హెడ్‌కానిస్టేబుల్ ఇస్మాయిల్.. అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓ యువకుడు ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు డయల్ 100కు కాల్‌రాగా.. మిల్స్‌కాలనీ హెడ్‌కానిస్టేబుల్ ఇస్మాయిల్ క్షణాల్లో ఘటనాస్థలికి చేరుకున్నారు. మద్యం మత్తులో పట్టాలపై తిరుగుతున్న యువకుడిని క్షేమంగా పట్టుకుని వివరాలు సేకరించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన హెడ్ కానిస్టేబుల్ ఇస్మాయిల్, కానిస్టేబుల్ నరేశ్‌ను ఇన్‌స్పెక్టర్ రమేశ్ అభినందించారు.