
సీఎం రేవంత్‌రెడ్డికి ఘనస్వాగతం
సాక్షిప్రతినిధి, వరంగల్/కాజీపేట : వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించేందుకు హనుమకొండకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల మృతి చెందగా కాజీపేట ప్రశాంత్ నగర్ సమీపంలోని పీజీఆర్ గా ర్డెన్‌లో బుధవారం మాతృయజ్ఞం నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హనుమకొండకు వచ్చారు. ఈ సందర్భంగా సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలోని హెలిపాడ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, విప్ రాంచందర్‌నాయక్, ఎంపీలు పో రిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, యశస్విని రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి రోడ్డు మార్గంలో పీజీఆర్ గార్డెన్‌లో కాంతమ్మ మాతృయజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంతమ్మ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి, తన కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రేవంత్.. తిరిగి హైదరాబాద్ వెళ్లారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి స్వాగ తం, వీడ్కోలు సంధర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పలువురు ఆయనను కలవగా, అందరినీ పేరుపేరున పలకరించి కుశలప్రశ్నలు వేశారు. ముఖ్యమంత్రి పర్యటన సంధర్భంగా పోలీసులు భారీభద్రత, బందోబస్తు ఏర్పాటు చేశారు.
హెలిపాడ్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు
మాతృయజ్ఞం వద్ద అందరిని
పలకరించిన సీఎం రేవంత్‌రెడ్డి..
స్వాగతం, వీడ్కోలు సందర్భంగా
కుశల ప్రశ్నలు..
మంత్రులతో కలిసి ఎమ్మెల్యే
మాధవరెడ్డికి సీఎం పరామర్శ