
నాలుగు రైళ్ల దారి మళ్లింపు
కాజీపేట రూరల్: దానాపూర్–బెంగళూరు–దానాపూర్ మధ్య ప్రయాణించే సూపర్‌ఫాస్ట్ రైళ్ల సర్వీస్‌లకు అక్టోబర్ 13 నుంచి 16వ తేదీ వరకు కాజీపేట, సికింద్రాబాద్, గుంతకల్, ధర్మవరం స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు.
దారి మళ్లించిన రైళ్లు ఇవే..
ఈ నెల 13న దానాపూర్–ఎస్‌ఎంవీవీ బెంగళూరు (03251) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 15న ఎస్‌ఎంవీటీ బెంగళూరు–దానాపూర్ (03252) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 14న దానాపూర్–ఎస్‌ఎంవీటీ బెంగళూరు (03259) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 16న ఎస్‌ఎంవీటీ బెంగళూరు–దానాపూర్ (03260) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు వరంగల్, విజయవాడ, ఒంగోలు, గూడూరు, పెరంబూర్, కటిపాడి, జోలర్‌పెట్టయ్, బంగారపేట్, వైట్‌ఫీల్డ్ మీదుగా కాకుండా వయా బల్లార్షా, కాజీపేట, సికింద్రాబాద్, సులేహలీ వెస్ట్, గుంతకల్, ధర్మవరం మీదుగా వెళ్లనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు.