
ఉద్యోగులు నైపుణ్యం పెంపొందించుకోవాలి
హన్మకొండ: ఉద్యోగులు నైపుణ్యం పెంపొందించుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి అ న్నారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ప ర్యటనలో ఆదివారం వరంగల్ రీజియన్‌ను సందర్శించారు. హనుమకొండలోని వరంగల్ రీజియన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిపోల వా రీగా ప్రగతిని సమీక్షించారు. ఆర్‌ఎం డి.విజయభాను, డిప్యూ టీ ఆర్‌ఎంలు, డిపో మేనేజర్లు డిపో వారీగా కార్యక్రమాలు, వస్తున్న ఆదాయం, తిరుగుతున్న కిలో మీటర్లు తదితర వివరాలు ఎండీకి వివరించారు. అనంతరం హనుమకొండ జిల్లా బస్ స్టేషన్‌ను పరిశీలించారు. వరంగల్–1 డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లకు ప్రగతి చక్రం పురస్కారాలు అందించారు. అనంతరం మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీకి ప్రయాణికులే దేవుళ్లన్నారు. వారిని ఆదరించి మర్యాదగా ప్రవర్తిస్తూ ఆక్యుపెన్షీ రేషియో పెంచుకోవాలన్నారు. ప్రజలకు సేవ చేయడం మన బాధ్యత అన్నారు. ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకుని మిగతావారు పోటీ పడి పని చేయాలన్నారు. వ్యయం తగ్గించడంతోపాటు ఆదాయం పెంపుపై దృష్టి సారించాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయన్నారు. వరంగల్ రీజియన్ పనితీరు బాగుందని కితాబు ఇచ్చారు. టెండర్లలో అక్రమాలు జరిగాయని విలేకరుల ఆయన దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి రుజువైతే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ పి.సోల్మన్, ఆర్‌ఎం డి.విజయభాను, డిప్యూటీ ఆర్‌ఎంలు కేశరాజు భానుకిరణ్, మహేశ్, డిపో మేనేజర్లు, అద్దె బస్సుల యజమానులు పాల్గొన్నారు.
ప్రయాణికులే సంస్థకు దేవుళ్లు
ప్రజలకు సేవలందించడం మన బాధ్యత
ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి

ఉద్యోగులు నైపుణ్యం పెంపొందించుకోవాలి