
శిల్ప కళా సౌందర్యం మహాద్భుతం
వెంకటాపురం(ఎం)/ ఖిలా వరంగల్: కాకతీయుల నిర్మాణాలు, శిల్ప కళా సౌందర్యం మహాద్భుతంగా ఉందని వరల్డ్ హెరిటేజ్ వలంటీర్లు అన్నారు. వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్‌లో భాగంగా రామప్పలో శిక్షణ పొందుతున్న వలంటీర్లు ఆదివారం పలు ఆలయాలను సందర్శించారు. రేగొండ పరిధిలోని పాండవుల గుట్ట, వరంగల్‌లోని వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్‌తో పాటు పలు పర్యాటక ప్రదేశాలను పరిశీలించారు. ఆలయాల విశిష్టత గురించి ప్రొఫెసర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి కాకతీయుల కట్టడాలు, శిల్ప సంపద బాగుందని, వీటిని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో క్యాంపు కోఆర్డినేటర్ శ్రీధర్‌రావు, ప్రొఫెసర్ పాండురంగారావు, టూరిజం అసిస్టెంట్ ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, తదితరులు పాల్గొన్నారు.

శిల్ప కళా సౌందర్యం మహాద్భుతం