నియామకమెప్పుడో..! | - | Sakshi
Sakshi News home page

నియామకమెప్పుడో..!

Oct 11 2025 6:04 AM | Updated on Oct 11 2025 6:26 AM

కన్వర్షన్‌ భర్తీతో అభ్యర్థులకు నష్టం

హన్మకొండ : టీజీ ఎన్పీడీసీఎల్‌లో చేపట్టిన సబ్‌ ఇ ంజనీర్ల నియామకంలో అన్యాయానికి గురైన తమ ను ఎప్పుడు విధుల్లోకి తీసుకుంటారని అభ్యర్థుల ను ఎదురు చూస్తున్నారు. యజమాన్యం చేసిన త ప్పిదాలు, అక్రమాలకు ఏడేళ్లుగా 24మంది అభ్యర్థులు నియామకాల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఈ క్రమంలో దిగువ కేడర్‌ ఉద్యోగులకు సబ్‌ ఇంజనీర్లుగా కన్వర్షన్‌కు అవకాశం కల్పించడంతో పోస్టులన్ని వారిచే భర్తీ చేస్తే తమకు పోస్టులు లేకుండా పోతా యని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తగ్గిన పోస్టుల సంఖ్య..

టీజీ ఎన్పీడీసీఎల్‌లో 497 సబ్‌ ఇంజనీర్ల భర్తీకి 2018, మే 24న నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అదే ఏడాది జూలై 8న రాత పరీక్ష నిర్వహించి, ఆగష్టు 31న ఫలితాలు ప్రకటించారు. మెరిట్‌ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సెప్టెంబర్‌ లో పాత సర్కిల్‌ వారీగా వేర్వేరు తేదీల్లో కాల్‌ లెటర్‌ పంపించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న 497మందికి కాకుండా 427 మందికి మాత్రమే కాల్‌ లెటర్‌ పంపి, 70 పోస్టులు తగ్గించారు. అదే సమయంలో ఎన్నికల కోడ్‌ రావడంతో తాత్కాలికంగా నియామక ప్రక్రియ నిలిపివేశారు. కోడ్‌ తర్వాత డిసెంబర్‌లో మరోసారి సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలని కాల్‌ లెటర్‌ పంపారు. దీంతో మరో 24 పోస్టులు తగ్గించారని అర్హులైన అభ్యర్థులు తెలిపారు. ముందు కాల్‌ లెటర్‌ అందుకుని రెండోసారి రాని అభ్యర్థులు వెంటనే హైకోర్టును ఆశ్రయించగా అందరికీ తిరిగి జారీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు 427 మందికి కాల్‌లెటర్‌ పంపి పోస్టులు భర్తీ చేశారు. అయితే ఇక్కడ కోర్టు ఆదేశాలతో కాల్‌ లెటర్‌ పొందిన 24 మందిని పక్కన పెట్టారు. తాము అధికారులను ఈ విషయమై సంప్రదిస్తే కోర్టు కాల్‌ లెటల్‌ మాత్రమే జారీ చేయమని చెప్పిందని, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పలేదంటూ తప్పించుకున్నారని అభ్యర్థులు వాపోయారు.

అక్రమంగా నియామకాలు..

సబ్‌ ఇంజనీర్‌ రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు టీజీ ఎన్పీడీసీఎల్‌ యజమాన్యానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీజీ ఎన్పీడీసీఎల్‌ పాత పాలక మండలిని రద్దు చేసింది. ఐఏఎస్‌ అధికారి కర్నాటి వరుణ్‌ రెడ్డిని చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, సీనియర్‌ సీజీఎంలను ఇన్‌చార్జ్‌ డైరెక్టర్లుగా నియమించింది. ఈ కమిటీ రాగానే అభ్యర్థులు సీఎండీని కలిసి వినతి పత్రం అందించి తమకు జరిగిన నష్టాన్ని వివరించారు. దీనికి తోడు ప్రజాపాలనలో ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణకు చేపట్టారు. టీజీ పీఎస్‌ఎస్‌సీకి చెందిన ఒకరు, టీజీ ఎస్‌పీడీసీఎల్‌, టీజీ ఎన్పీడీసీఎల్‌ నుంచి ఇద్దరేసి అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. నియామకాల ప్రక్రియ మొత్తాన్ని వడపోసి చివరకు అక్రమాలు జరిగినట్లు తేల్చింది. 24 మంది నియామకాలు అక్రమంగా జరిగినట్లు, అర్హత లేని వారిని నియమించినట్లు విచారణ కమిటీ తేల్చింది.

దిగువ కేడర్‌కు సబ్‌ ఇంజనీర్లుగా

అవకాశం

ఆందోళనలో అన్యాయానికి గురైన

24 మంది అభ్యర్థులు

అక్రమాలను గుర్తించిన ప్రత్యేక కమిటీ

427 సబ్‌ ఇంజనీర్‌ పోస్టుల్లో 24 మంది అనర్హులను భర్తీ చేశారు. అర్హులైన 24 మందిని పక్కన పెట్టారని విచారణ కమిటీ తేల్చింది. అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్న 24 మందికి యాజమాన్యం నోటీసులు జారీ చేసింది. దీంతో కోర్టును ఆశ్రయించగా వారు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా న్యాయంగా ఉద్యోగాలు దక్కాల్సిన వారు మాత్రం యాజమాన్యం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మరో వైపు ఖాళీగా ఉన్న సబ్‌ ఇంజనీర్ల పోస్టులు అర్హత ఉన్న దిగువ కేడర్‌ ఉద్యోగులను కన్వర్షన్‌ ద్వారా భర్తీ చేస్తుండడంతో నష్టపోయిన అభ్యర్థులు తమ భవిష్యత్‌ ఏంటనే ఆలోచనలో పడ్డారు. వయోభారం మీద పడుతుండడంతో అభ్యర్థులు రోజు రోజుకూ కృంగిపోతున్నారు. ఇప్పటికై నా తమకు జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని గమనించి వెంటనే తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సబ్‌ ఇంజనీర్‌ అభ్యర్థులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement