
డిజిటల్ హుండీల ఏర్పాటు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద భక్తులు ఆన్‌లైన్‌లో కానుకల చెల్లింపునకు తాడ్వాయి కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో పూజారులతో కలిసి శుక్రవారం డిజిటల్ హుండీలు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి భక్తులు బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో వేల సంఖ్యలో వస్తున్నారు. వారు ఇబ్బంది పడకుండా గూగుల్, ఫోన్ పే ఆన్‌లైన్ చెల్లింపుల కోసం కెనరా బ్యాంక్ అధికారులు క్యూఆర్ స్కాన్ కోడ్ డిజిటల్ హుండీ అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ లకావత్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా భక్తులు సమర్పించిన కానుకలు సమ్మక్క–సారలమ్మ ఖాతాలో నేరుగా జమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారులు కొక్కెర కృష్ణయ్య, ఎండోమెంట్ జూనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్ పాల్గొన్నారు.