
పత్తి కొనుగోళ్లకు పూజలు
వరంగల్ చౌరస్తా: పత్తి కొనుగోళ్ల కోసం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పలువురు వ్యాపారులు, అడ్తిదారులు కాంటాల వద్ద గురువారం ప్రత్యేక పూజాలు చేశారు. కొద్ది రోజులుగా కొత్త పత్తి వస్తున్న నేపథ్యంలో పూజలు చేసి, కాంట్రాలు ప్రారంభించారు.
మారని సరుకుల ధరలతో అయోమయం
రైతులకు మెరుగైన సేవలు అందించడంలో మార్కెట్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరల మార్పులు, చేర్పులను హాజరు సూచిక పట్టికలో నమోదు చేయడంలో యంత్రాంగం విఫలమైంది. మార్కెట్ ఇన్‌చార్జ్ కార్యదర్శి జి.రెడ్డి సెలవుల్లో ఉండటంతో ధరల మార్పులు, చేర్పులు చేసే నాథుడే కరువయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా పట్టికలో మార్పులు చేయాలని రైతులు కోరుతున్నారు.

పత్తి కొనుగోళ్లకు పూజలు