
విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడి మృతి
నర్సంపేట : విద్యుదాఘాతంతో ఓ భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేటలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నారావుపేటకు చెందిన చిరబోయిన రాజు(30) ఖాదర్‌పేటలోని పెండ్లి ఐలయ్య ఇంటి నిర్మాణంలో భాగంగా సెంట్రింగ్ పనులు చేయడానికి వెళ్లాడు. బుధవారం స్లాబ్ వేస్తుండగా సెంట్రింగ్ సరి చేస్తున్న క్రమంలో చేతిలో ఉన్న బైండింగ్ వైర్ ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్ తీగకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై కింద పడగా తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం నర్సంపేటకు తరలించారు. పరిస్థితి విషయంగా ఉండడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడికి భార్య మౌనిక, కుమారులు వరుణ్‌సాయి, చరణ్‌సాయి ఉన్నారు.
రైలు ఢీకొని వ్యక్తి..
కేసముద్రం/ ఖిలా వరంగల్: ట్రాక్ దాటుతుండగా గూడ్స్ (రైలు) ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం కేసముద్రం రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ సుదర్శన్ కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధి ఎన్టీఆర్ నగర్‌కు చెందిన భుక్యా లక్కు(53) ఇంటికన్నె–కేసముద్రం రైల్వేస్టేషన్ల మధ్య ఫ్లై ఓవర్ సమీపంలో ట్రాక్ దాటుతుండగా డౌన్‌లైన్‌లో వచ్చిన గూడ్స్ ఢీకొంది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడి మృతి