
పేదలకు భరోసా కల్పించాలి
● డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు
తొర్రూరు: ఉపాధిహామీ పనులు కల్పించి పేదలకు భరోసా కల్పించాలని డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు తెలిపారు. డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఉపాధిహామీ పనులపై ప్రజావేదిక కార్యక్రమం చేపట్టారు. 2024–25లో మండలంలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనులపై సమీక్ష నిర్వహించారు. మండలంలో రూ.3 కోట్ల విలువ చేసే 277 ఉపాధిహామీ పనులు జరగగా, దానికి సంబంధించిన నివేదికలను చదివి వినిపించారు. డిమాండ్ లేకుండానే పనుల నిర్వహణ, జాబ్ కార్డులు అప్‌గ్రేడ్ చేయకపోవడం, మస్టర్లలో సంతకాలు లేకుండా కూలీలకు వేతనాల చెల్లింపు వంటి లోపాలను గుర్తించారు. ఉపాధిహామీ సిబ్బంది నుంచి రూ.2.40 లక్షల రికవరీకి సిఫార్సు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్‌డీఓ మాట్లాడుతూ.. సామాజిక తనిఖీతో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ఎలాంటి తప్పులు జరగడానికి ఆస్కారం ఉండదన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కూస వెంకటేశ్వర్లు, అంబుడ్స్‌మెన్ ఆడమ్, విజిలెన్స్ కోఆర్డినేటర్ మన్మోహన్‌రెడ్డి, ఏపీఓ మధు, ఎస్‌ఆర్‌పీ కవిత, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.