పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ల నియామకం
జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు
మహబూబాబాద్ రూరల్/బయ్యారం/తొర్రూరు రూరల్: జిల్లాలోని 18 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయని, అందులోని ఐదు సొసైటీల పాలకమండళ్లను రద్దుచేసి, పర్సన్ ఇన్‌చార్జ్‌గా అసిస్టెంట్ రిజిస్ట్రార్లను నియమించినట్లు జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. జిల్లాలోని కేసముద్రం, కురవి, బయ్యారం, నెల్లికుదురు, తొర్రూరు సొసైటీల పాలకమండళ్లు రద్దయ్యాయని తెలిపారు. కేసముద్రం సొసైటీకి ప్రవీణ్, కురవి సుమలత, బయ్యారం ఆదినారాయణ, నెల్లికుదురుకు మనోహర్ రావు, తొర్రూరు సొసైటీకి రమేశ్ పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా పీఏసీఎస్ పాలకమండళ్లు పనిచేయలేదనే కారణంతో సర్కారు రద్దు చేసిందన్నారు. కాగా, ప్రభుత్వ నిబంధనలను అమలుచేయకపోవడంతో పాటు ఆయా సొసైటీల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో సంబంధిత అధికారులు విచారణ చేపట్టి పాలకమండళ్లను రద్దు చేయాలని ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. మిగిలిన 15 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పాలకమండళ్ల పదవీకాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.