
సమాజ సేవ చేయాలి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది సమాజ సేవ చేసి ప్రజల మన్ననలు పొందాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ బుధవారం జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఉన్న ఉత్సాహాన్ని చివరి వరకు కొనసాగించాలన్నారు. తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడానికి తమవంతు కృషి చేయాలని, ప్రజాపాలన దినోత్సవం ప్రజల కోసం సేవాభావం, సమానత్వం, న్యాయం అనే విలువలను గుర్తుచేస్తుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తూ, ప్రతిపల్లె, ప్రతివాడ, ప్రతిఇంటి వరకు ప్రభుత్వ సేవలను చేరవేయడం ప్రజాపాలన ప్రధాన ధ్యేయమని, ఇది ప్రజల పాలన అనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.