
నిజాంను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టులది
నెహ్రూసెంటర్: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం నిజాం సర్కార్‌ను తరిమికొట్టి తెలంగాణను విముక్తి చేసి, దున్నేవాడికే భూమి అంటూ 10 లక్షల ఎకరాల భూములను పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టులదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు వేల మంది అమరత్వం, హింస, దోపిడీకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగిందని, రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనన్నారు. కమ్యూనిస్టుల పోరాట చరిత్రను కనుమరుగు చేసేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ యత్నిస్తున్నాయని మండిపడ్డారు. నా టి నిజాం ప్రభుత్వానికి నేటి కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వానికి తేడా ఏమి లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రభుత్వ, బంచరాయి భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో శెట్టి వెంకన్న, సూర్నపు సోమయ్య, గునిగంటి రాజన్న, ఆకుల రాజు, కందునూరి శ్రీనివాస్, కుంట ఉపేందర్, అల్వాల వీరయ్య, బానోత్ సీతారాంనాయక్, తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ