
పాము కాటుతో మహిళ మృతి
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివా రులో నివాసముంటున్న లావుడియా కమల(35) పాము కాటుకు గురై మంగళవారం మృతి చెందింది. ముల్కనూర్ ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ మండలం దేశరాజుపల్లికి చెందిన కమల–రమేశ్ దంపతులు బతుకుదెరువు కోసం వచ్చి కొత్తపల్లి శివారులో ఉంటున్నారు. ఈక్రమంలో మంగళవా రం ఇంట్లో నిద్రిస్తుండగా కమలను పాము కాటేసింది. భర్త రమేష్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా కమ ల మృతి చెందింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యా దు మేరకు ఎస్సై రాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కమలకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు..
ఐనవోలు: తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతిచెందిన సంఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని రాంనగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరా ల ప్రకారం.. బుర్ర సాంబరాజు(41) గీత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వృత్తిలో భాగంగా మంగళవారం తాటిచెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందా డు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. సాంబరాజుకు భార్య సంధ్య, కుమారుడు సిద్దు, కూతురు సిరి ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి ..
కేసముద్రం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మానుకోట జిల్లా కేసముద్రం మండలంలోని చంద్రుతండా జీపీ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. తండావాసులు తెలి పిన వివరాల ప్రకారం.. మండలంలోని వెంకటగిరి సమీపంలోని చంద్రుతండా జీపీకి చెందిన చెందిన లకావత్ దేవా(35) వెంకటగిరి గ్రామం నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించేక్రమంలో బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కనున్న భగీరథ ఎయిర్‌వాల్ దిమ్మెను ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయ మైంది. దీంతో మానుకోట జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య అనిత, రెండేళ్ల కుమారుడు ఉన్నారు.
లిఫ్ట్ ఇరిగేషన్‌కు
విద్యుత్ సరఫరా సిద్ధం
● ట్రాన్స్‌కో సీఈ రాజుచౌహాన్
కాటారం: చిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌లో భాగంగా గారెపల్లి పంప్‌హౌస్ కోసం నిర్మించిన సబ్‌స్టేష న్ ద్వారా విద్యుత్ సరఫరా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రాన్స్‌కో సీఈ రాజుచౌహాన్ తెలిపారు. ఎస్‌ఈ మల్చూర్‌తో కలిసి సీఈ లిఫ్ట్ ఇరిగేషన్ గారెపల్లి నూతన సబ్‌స్టేషన్‌ను మంగళవారం పరిశీలించారు. సబ్‌స్టేషన్‌లో అమర్చిన యంత్రాల వివరా లు, పవర్ లోడ్ కెపాసిటీ, సరఫరా ప్రక్రియ తదితర అంశాలపై ట్రాన్స్‌కో అధికారులతో ఎస్‌ఈ చర్చించారు. ప్రొటెక్షన్ వింగ్, టెక్నికల్ వింగ్ ఆధ్వర్యంలో టెస్ట్ చార్జ్ చేశారు. అనంతరం లో ఓల్టేజ్ సమస్య నివారణలో భాగంగా మండల కేంద్రంలోని ఎర్రగుంటపల్లిలో అమర్చిన నూతన 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను సీఈ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యు త్ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా నా ణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నట్లు సీఈ తెలి పారు. లో ఓల్టేజ్ సమస్యలను అధిగమించేందుకు సీఎండీ ఆదేశాల మేరకు అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. డీఈఈలు పాపిరెడ్డి, సదానందం, ఏడీఈ నాగరాజు, ఏఈ ఉపేందర్, లైన్ ఇన్‌స్పెక్టర్ క్రాంతికిరణ్ పాల్గొన్నారు.

పాము కాటుతో మహిళ మృతి

పాము కాటుతో మహిళ మృతి

పాము కాటుతో మహిళ మృతి