ఆడిందే ఆట! | - | Sakshi
Sakshi News home page

ఆడిందే ఆట!

Aug 8 2025 9:19 AM | Updated on Aug 8 2025 9:19 AM

ఆడిందే ఆట!

ఆడిందే ఆట!

పూర్తిస్థాయి అధికారులతోనే..

ఉమ్మడి జిల్లాలోని 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో పాటు 162 చిట్‌ఫండ్‌ల పర్యవేక్షణకు పూర్తిస్థాయి అధికారులను నియమిస్తే తప్ప పాలన గాడిలో పడేలా లేదు. ప్రజలకు బాధలు తీరేలా లేవు. పదోన్నతుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన జాయింట్‌–1 సబ్‌ రిజిస్ట్రార్లకు పదోన్నతులు కల్పిస్తే పూర్తిస్థాయిలో అధికారులను నియమించే అవకాశం ఉంటుంది.

కాజీపేట అర్బన్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రిజిస్ట్రేషన్‌ అండ్‌ చిట్స్‌ శాఖలోని ఉన్నతాధికారుల పాలన ఇన్‌చార్జ్‌ల చేతుల్లో కొనసాగుతోంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచే శాఖలో ఇన్‌చార్జ్‌ పాలనతో నిర్వహణ గాడి తప్పుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో పాటు 162 బ్రాంచ్‌లతో కూడిన చిట్‌ఫండ్‌ కార్యాలయాలపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేక కింది స్థాయి అధికారుల విధుల్లో అలసత్వం వహిస్తున్నారు. అడిగేవారు ఎవరూ లేకపోవడంతో ఆడిందే ఆటగా కొలువులు సాగిస్తున్నారు.

ప్రజల బారులు..

ఉమ్మడి జిల్లాలోని 13 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో పాటు చిట్స్‌, ఆడిటింగ్‌, కోర్టు కేసులు, ప్రొహిబిటెడ్‌, ల్యాండ్‌ కేసులు, డాక్యుమెంట్లలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి నిత్యం జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ప్రజలు బారులు దీరుతుంటారు. ఇక్కడ పని చేస్తున్న జిల్లా రిజిస్ట్రార్‌ ఫణీందర్‌ను జూలైలో హైదరాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్‌ ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌గా బదిలీ చేశారు. దీంతో కరీంనగర్‌ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్‌కుమార్‌ను ఉమ్మడి వరంగల్‌ ఇన్‌చార్జ్‌ నియమించారు. ఏడాది క్రితం ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా చిట్స్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా బదిలీపై వచ్చిన యామిని రెండు నెలల కాలవ్యవధిలో విధులు చేపట్టి నాటినుంచి నేటి వరకు లాంగ్‌ లీవ్‌లో వెళ్లిపోవడంతో ఇన్‌చార్జ్‌ చిట్స్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పాలనే కొనసాగుతోంది. దీంతో చిట్స్‌లో పేరుకుపోయిన చిట్‌ఫండ్స్‌ లావాదేవీలతో పాటు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విడుదల సైతం ప్రశ్నార్థకంగా మారింది.

ఇన్‌చార్జ్‌ల చేతుల్లో రిజిస్ట్రేషన్‌ శాఖ

ఉమ్మడి జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌

కార్యాలయాల్లో గాడి తప్పిన పాలన

కిందిస్థాయి అధికారుల ఇష్టారాజ్యం

పూర్తి స్థాయిలో అధికారులను

నియమిస్తే సమస్యలు పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement