
బీసీలను మోసం చేస్తున్న ప్రభుత్వం
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
జనగామ రూరల్: బీసీ బిడ్డలను కాంగ్రెస్ ప్రభుత్వం మో సం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అ ధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. గురువారం జనగామలో నిర్వహించిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదని, మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమని స్ప ష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా లేదా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డి మాండ్ చేశారు. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందని, అక్రమాలపై విచారణను సీబీఐకి ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరికి ప్రయోజనం చేకూరుతుందో అర్థం అవుతోందన్నారు. బీఆర్‌ఎస్‌ను కాపాడేందుకే కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి బీజేపీని ఆదరించాలని కోరారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నాయన్నారు. రాష్ట్ర నాయకులు మూర్తినేని ధర్మారావు, బూర నర్సయ్య గౌడ్, గుండె విజయరామారావు, ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, లేగ రామ్మోహన్‌రెడ్డి , ఉడుగుల రమేశ్, కేవీఎల్‌ఎన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, మాజీ అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.