
తీజ్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించాలి
హన్మకొండ: తీజ్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించాలని మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. హనుమకొండ అశోక కాలనీలోని గిరిజన భవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారాలు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైనది తీజ్ అని అన్నారు. 9 రోజులపాటు ఆటపాటలతో అలసట నుంచి విముక్తి కావాలని, అందరూ బాగుండాలని జరుపుకుంటారన్నారు. పెళ్లికాని యువతలు ఎంతో భక్తితో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. బంజారాల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు గోర్ బంజార తీజ్ ఉత్సవ కమిటీ కృషి చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో హనుమకొండ అశోక కాలనీలోని గిరిజన భవన్‌లో ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు గోర్ బంజార తీజ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని బంజారాలు అందరు ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం తీజ్ ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో గోర్ బంజార తీజ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు వినోద్ లోక్‌నాయక్, బాదావత్ బాలాజీనాయక్, ధరావత్ కిషన్ నాయక్, భూక్యా రాజునాయక్, డాక్టర్ చందునాయక్, మాలోత్ రమేశ్, భిక్షపతినాయక్, కిశోర్ నాయక్, నర్సింహానాయక్ పాల్గొన్నారు.
మాజీ ఎంపీ ప్రొఫెసర్
అజ్మీరా సీతారాంనాయక్