
లారీ, కారు ఢీ
గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట సమీప వైకుంఠధామం ఎదుట 365 జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారు డ్రైవింగ్ చేస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఎస్సై బి. గిరిధర్‌రెడ్డి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఐరన్ షాపు యజమాని బూర అశోక్‌కుమార్‌గౌడ్ (55) కారులో మహబూబాబాద్ నుంచి నర్సంపేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గూడూరు మండలం భూపతిపేట సమీపంలోని వైకుంఠధామం వద్ద నర్సంపేట నుంచి గూడూరు వైపున వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో కారు సగభాగం నుజ్జునుజ్జయి అశోక్‌కుమార్ గౌడ్ అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న మృతుడి కుటుంబీకులు, బంధువులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపించారు. ఎస్సై గిరిధర్‌రెడ్డి రెండు గంటల పాటు శ్రమించి కారు సగభాగం వేరు చేసి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు.
అక్కడికక్కడే ఒకరు దుర్మరణం
భూపతిపేట సమీపంలో ఘటన

లారీ, కారు ఢీ