
విద్య, ఆరోగ్యంతోనే ప్రజాశ్రేయస్సు
కేయూ క్యాంపస్ : అభివృద్ధి అంటే మౌలిక వసతులు, తలసరి ఆదాయం, స్థూల జాతీయ ఉత్పత్తియే కాదని, విద్య, ఆరోగ్య ద్వారానే ప్రజాశ్రేయస్సు సాధ్యమని, ఆ దిశగా రాష్ట్రాలు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)ఎకనామిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డి. నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్‌హాల్‌లో డాక్టర్ జయశంకర్ స్మారకోపన్యాసం కార్యక్రమంలో ‘డెవలప్‌మెంట్ డిపార్టీస్ అండ్ ది ఫర్మార్మెన్స్ ఆఫ్ ది సోషల్ సెక్టార్ ఇన్‌ది సౌథర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా’ అనే అంశంపై మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ వివిధ రంగాల్లో వెనుకబాటులోనే ఉందన్నారు. విద్య, వైద్య శ్రేయస్సు ద్వారానే ఉత్పాదకత పెరుగుతుందన్నారు.బాలికలు, మహిళల్లో రక్తహీనత ఎక్కువ ఉందన్నారు.డాక్టర్ జయశంకర్ సామాజిక ప్రజాస్వామిక తెలంగాణను కలగన్నారన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండాప్రకాశ్ మాట్లాడుతూ జయశంకర్ గొప్పమానవతావాది అన్నారు. తెలంగాణ స్వాప్నికుడు, విద్యావేత్త, దూరదృష్టిగల గొప్పవ్యక్తి అని కొనియాడారు. కేయూ విశ్రాంత కామర్స్ విభాగం ప్రొఫెసర్, మాజీ రిజిస్ట్రార్, జయశంకర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఎ. శంకరయ్య మాట్లాడుతూ జయశంకర్ గొప్పపరిపాలనాదక్షుడన్నారు. అనంతరం కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్ మాట్లాడారు.
హెచ్‌సీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ నర్సింహారెడ్డి