
సిబ్బంది భద్రతాప్రమాణాలు పాటించాలి
హన్మకొండ: విద్యుత్ సిబ్బంది భద్రతాప్రమాణాలు పాటించాలని, ఈ దిశగా అధికారులు దృష్టి సారించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి సూచించారు. బుధవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్‌ఈ, డీఈ, ఏడీఈ, ఏఈ, ఎస్‌ఏఓ, ఏఏఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా తగ్గించాలన్నారు. ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న లూజు లైన్లు, వంగిన పోల్స్, తుప్పు పట్టిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మన్ల గద్దెలను, లైన్ క్రాసింగ్, డబుల్ ఫీడింగ్ స్తంభాలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. ప్రతీ వారం దీనిపై ఉన్నతాధికారులు సమీక్షిస్తూ పనులు పురోగతిలో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించే లైన్ పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సి.ఈలు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, రాజు చౌహాన్, అశోక్, వెంకట రమణ, ఆర్.చరణ్ దాస్, జీఎంలు వేణుబాబు, కృష్ణ మోహన్, వాసుదేవ్, సత్యనారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి