
ముంపుగ్రామాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ పర్యటన
మరిపెడ రూరల్: గతేడాది ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో మండలంలోని సీతారాంతండా, ఉల్లెపల్లి, బాల్నిధర్మారం గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామాల్లో గురువారం జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందం సభ్యులు స్థానిక అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ముందు గతేడాది జరిగిన విపత్తు గురించి ఆయా గ్రామాల ప్రజలను అడిగా తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వరదలు వచ్చిన సమయంలో ధైర్యం కోల్పోకుండా ఒకరికొకరు సాయంగా ఉండాలన్నారు. తాళ్ల సాయంతో వరద ఉధృతి నుంచి బయటకొచ్చే వీలుగా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ప్రజలకు విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు మరిపెడ ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీఓ సోమ్లానాయక్, ఆర్‌ఐ శరత్‌చంద్ర, తదితరులు పాల్గొన్నారు.
విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన