
ప్రకృతితో అనుబంధం
ప్రతీది ప్రకృతితో అనుబంధంగానే మా జీవన విధానం ఉంటుంది. మా పంటలు, కుటుంబాలతోపాటు, ఆడపిల్లకు సరైన వరుడిని కూడా ప్రకృతి అనుమతితోనే పొందాలన్నదే తీజ్ ఉద్దేశం. చిన్నతనంలో పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్లం.. ఇప్పటికీ తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం అంటే భలే ఇష్టం.
– భూక్య ఉమ, మహబూబాబాద్
అంతా మేరామా యాడీ దయ
మా కుల దేవతలు సేవాలాల్, మేరామా యాడీ(గౌరీ దేవి)కి పూజలు చేసి తీజ్ పండుగను ప్రారంభిస్తాం. అంతా అమ్మవారే చూసుకుంటారని నమ్మకం. అందుకోసం గోధుమలు తెచ్చి నిష్టతో తొమ్మిది రోజులు పూజలు చేస్తాం. యువతులు పాటలు పాడుతూ.. ఆటలు ఆడడం సరదాగా ఉంటుంది.
– జాటోత్ ఝాన్సీలక్ష్మి, గార్ల

ప్రకృతితో అనుబంధం