గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025

Aug 7 2025 9:36 AM | Updated on Aug 7 2025 9:36 AM

గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025

గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025

8లోu

సాక్షి, మహబూబాబాద్‌ :

గిరిజన(లంబాడ) కన్నెపిల్లలు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్‌. ఈ నెలలో పండుగను ప్రతీ గురువారం ఏదో ఒక తండాలో జరుపుకుంటారు. నేడు (గురువారం) ఉమ్మడిజిల్లాలోని పలు తండాలు తీజ్‌ పండుగకు ముస్తాబయ్యాయి. ప్రకృతి సిద్ధంగా శ్రావణంలో వర్షాలు కురవడంతో ఆకాశం నుంచి కిందికి వచ్చే ఎర్రని వర్ణం గల ఆరుద్ర పురుగులను కూడా తీజ్‌ అంటారు. ఆ అందమైన పురుగులు దేవుడు మనకోసం కిందికి పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు కన్నె పిల్లలు మనస్సులో కోరుకున్న కోరిక ఫలిస్తుందనేది గిరిజనుల నమ్మకం. మా తాండేరో జోత్‌ తీజ్‌ (తండాల్లో వెలుగు తీజ్‌) అంటూ పండుగకు సిద్ధమయ్యారు.

తొమ్మిది రోజులపాటు నిష్టతో కన్నె పిల్లల పూజలు

గిరిజన తండాల్లో తీజ్‌ సంబురాలు

● ఏడో రోజు ఢమోళీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఢమోళీ చుర్మో(రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామా భవానికి నేవైద్యం పెడతారు.

● ఎనిమిదో రోజు మట్టితో బంజారా ఆరాధ్య దైవాల ప్రతిరూపాలను తయారు చేస్తారు. అబ్బాయి(డోక్రా), అమ్మాయి(డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేస్తారు. ● తొమ్మిదో రోజు డప్పుచప్పుళ్లు, గిరిజన నృత్యాలతో అందరూ బుట్టల వద్దకు వెళ్తారు. తండా నాయక్‌ వచ్చి యువతులకు బుట్టలను ఇచ్చి ఆశీర్వాదం అందిస్తారు.

● లంబాడీల ఆరాధ్య దైవం తుల్జా భవానీ, సేవాబాయి, సీత్లాభవానీలకు పూజలు చేసి స్నానాలు ఆచరించి పవిత్రతతో పుట్టమట్టిని తెస్తారు.

● తీజ్‌ (గోధు మ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్లి దుస్సేరు(ఫిలోణీర్‌ వేళ్లీ) తెస్తారు. ఈ తీగ లతో బుట్టలు అల్లుతారు.

● పెండ్లీడుకు వచ్చిన యువతి తనకు కావాల్సి న పెళ్లికొడుకు కోసం చేసే ఈ పండుగలో ముందుగా తల్లిదండ్రులు, తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండా పెద్ద నాయక్‌ అనుమతి పొందిన తర్వాత పండుగ తంతు మొదలుపెడతారు.

సంప్రదాయ

పాటలు

మొదటి రోజు :

చివరి రోజు :

● లంబాడీ భాషలో బోరడీ ఝుష్కేరో అంటే రేగుముళ్లు గుచ్చడం. తీజ్‌ వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనిగలకు యువతలు రేగుముళ్లు గుచ్చుతారు. బావ వరుస ఉన్న వారు కన్నెపిల్ల మనస్సు చెదిరేలా కదిలిస్తూ ఉంటారు. అప్పుడు రేగుముళ్లు శనిగలకు కాకుండా వారి చేతికి కూడా గుచ్చుకుంటాయి. దీనిని భరిస్తూ రేగుముళ్లు శనిగలకు గుచ్చడం ఈ తంతు ప్రత్యేకత.

లాంబి లాంబియే లాంబడీ ఏకెరీయో... తోన కుణ బొరాయో తీజ్‌.. సేవాభాయ బొరాయో తీజ్‌.. (గునుగుపూల వలె ఎదుగుతవమ్మా.. నిను కొలిచే వారెవరమ్మా.. సేవాలాల్‌ మహరాజ్‌ అలికి కొలుస్తారమ్మా తీజ్‌..) అని పాడుతూ తొలిరోజు వేడుకలు జరుపుకుంటారు.

తూ కతేతి ఆయోరే దుదియా తళవో.. మారో తీజేరో జోత్‌ లేయి చాలో.. డగేరేచాలో.. (ఎక్కడినుంచి వచ్చావో దుదియా చెరువు.. తొమ్మిది రోజులు పెంచుకున్న తీజ్‌ తండా వెలుగును తీసుకుని వెళ్తున్నావు) అంటూ పెళ్లికాని అమ్మాయిలు పాటలు పాడుతూ తీజ్‌ బుట్టలను చెరువులో నిమజ్జనం చేస్తారు.

9

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement