
పిల్లలూ పాఠాలు అర్థమవుతున్నాయా..
మహబూబాబాద్ అర్బన్: పిల్లలూ.. సార్లు బో ధించే పాఠాలు అర్థమవుతున్నాయా అని రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమయానికి హాజరుకావాలని, విద్యార్థుల్లోని సామర్థ్యాలను వెలికితీయలన్నారు. మ్యూజిక్ పరికరాలను విద్యార్థులకు వినియోగించాలన్నారు. అనంతరం మున్సిపాలిటీ పరి ధిలోని అనంతారం మోడల్ స్కూల్‌ను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మా ట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమలో డీఈఓ రవీందర్‌రెడ్డి, రాష్ట్ర ఏఎంఓ జావీద్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, జిల్లా కోఆర్డి నేటర్ ఆజాద్‌చంద్రశేఖర్, హెచ్‌ఎంలు వెంకటేశ్వర్లు, ఉపేందర్‌రావు ఉన్నారు.
ఈ–పాస్ మిషన్ ద్వారానే
అమ్మకాలు చేపట్టాలి
కురవి: ఈ–పాస్ మిషన్ ద్వారానే ఎరువుల అమ్మకాలు చేపట్టాలని డీఏఓ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని మోద్గులగూడెంలోని ఫౌల్ట్రీఫాంలో తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాలు, గోదాంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని, నానో యూరియా వాడాలని సూచించారు. ఆమె వెంట ఏఓ నర్సింహారావు, సీఈఓ జితేందర్, శ్రీపాల్, రాధాకృష్ణ పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సు ఇంజన్‌లో పొగలు
మహబూబాబాద్ రూరల్: హనుమకొండ నుంచి మహబూబాబాద్ పట్టణానికి వస్తున్న ఆర్టీసీ బస్సు కంబాలపల్లి గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఇంజన్‌లో నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చిన సంఘటన బుధవారం జరిగింది. డ్రైవర్ వెంటనే స్పందించి బస్సును నిలిపివేసి ప్రయాణికులందరినీ కిందకు దింపాడు. ఆ బస్సు వెనుకాలే వస్తున్న నర్సంపేట డిపోకు చెందిన మరో బస్సులో ప్రయాణికులను ఎక్కించి మహబూబాబాద్ పంపించారు.
ఇటలీ వాసులకు రాఖీలు
కట్టిన ముస్లిం మహిళలు
తొర్రూరు: అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి ముందస్తు వేడుకల్లో భాగంగా ముస్లిం మహిళలు విదేశీయులకు రాఖీలు కట్టి సమైక్యత చాటారు. బాల వికాస కార్యక్రమాలను తెలుసుకునేందుకు ఇటలీ దేశానికి చెందిన ప్రాన్సెస్కా, ఆల్బర్ట్‌లు బుధవారం తొర్రూరుకు వచ్చారు. అతిథులను చూసిన ముస్లిం మహిళలు షాహీన్ సుల్తానా, ఆసియాలు వారికి రాఖీలు కట్టి సోదరభావం చాటారు. ఇటలీ వాసులకు దుస్తులు, గాజులు బహూకరించారు. ఇటలీలోని క్యాథలిక్ యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థులైన ప్రాన్సెస్కా, ఆల్బర్ట్‌లు 4 వారాలుగా భారత్‌లో బాలవికాస కార్యక్రమాలపై అధ్యయనం చేస్తున్నారు.

పిల్లలూ పాఠాలు అర్థమవుతున్నాయా..

పిల్లలూ పాఠాలు అర్థమవుతున్నాయా..