
పల్లెల్లో ఆరోగ్య అవగాహనకు ప్రత్యేక చర్యలు
బయ్యారం: పల్లెల్లో ఆరోగ్య అవగాహన కోసం వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మలేరియా అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్‌సింగ్ అన్నారు. బయ్యారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో బుధవారం బయ్యారం, గంధంపల్లి, కొత్తగూడ, ముల్కనూర్, కోమట్లగూడెం, గంగారం పీహెచ్‌సీల వైద్య సిబ్బందితో సీజనల్ వ్యాధులు, పైలేరియాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది సమయానికి విధులకు హాజరుకావాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పైలేరియా వ్యాఽధిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ నెల 10నుంచి 25వ తేదీ వరకు ఆరు పీహెచ్‌సీల పరిధిలో ౖపైలేరియా నివారణపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వానాకాలంలో వచ్చే రోగాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు తమశాఖకు సహకరించాలన్నారు. అనంతరం పీహెచ్‌సీలో రోగ నిర్ధారణకు ఉపయోగిస్తున్న టెస్టింగ్ కిట్లు, ఔషధాల లభ్యత, రిజిస్టర్ల నిర్వహణ, పోర్టల్‌లో ఎంట్రీ చేసే విధానాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, సబ్‌యూనిట్ ఆఫీసర్ రామకృష్ణతో పాటు ఆరు పీహెచ్‌సీల వైద్యులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
వ్యాధుల నివారణకు చర్యలు
నెహ్రూసెంటర్: సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని మలేరియా అడిషనల్ డైరెక్టర్ అమర్‌సింగ్‌నాయక్ సూచించారు. జిల్లా ఆస్పత్రిలో బుధవారం సీజనల్ వ్యాధుల నివారణపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా ఆసుపత్రిలోని టీహబ్ డయాగ్నస్టిక్స్, బ్లడ్‌బ్యాంక్ పరిశీలించారు. ఈ నెల 10 నుంచి 25వరకు పైలేరియాపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, ఆర్‌ఎంఓలు హర్షవర్ధన్, జగదీశ్వర్, ప్రోగ్రాం అధికారులు, వైద్యా అధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
మలేరియా అడిషనల్ డైరెక్టర్ అమర్‌సింగ్