
జయశంకర్ ఆశయాలను సాధించాలి
మహబూబాబాద్ అర్బన్: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను సాధించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి ఎం.నర్సిహస్వామి, జెడ్పీ సీఈఓ పురుషొత్తం, అధికారలు వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్, సురేష్, మరియన్న, కిరణ్, వీరన్న, వెంకటరమణ, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో