
మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను కొనాలి
మహబూబాబాద్ అర్బన్: స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రజ లు కొనుగోలు చేసి, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. జిల్లా కేంద్రంలోని తొర్రూరు బస్టాండ్ సెంటర్‌లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారు చేసిన ఉత్పత్తుల స్టాళ్లను బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఆదివాసీ కళాకారులు, గ్రామీణ పారిశ్రామికులు తయారు చేసిన ఉత్పత్తులు బాగున్నాయన్నా రు. ముఖ్యంగా ఇప్పుపువ్వు లడ్డూ, మిల్లెట్ బిస్కెట్స్, తేనె, చేతితో తయారు చేసిన జ్యూట్ బ్యా గులు చాలా బాగున్నాయన్నారు. ఈ నెల 4నుంచి నుంచి 8వ తేదీ వరకు ఈ ఉత్పత్తుల స్టాల్స్ ప్రదర్శించబడుతాయని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మార్జా మునవర్‌బేగ్, తహసీల్దార్ రాజేశ్వర్, మెప్మా పీడీ విజయకుమారి, అధికారులు శ్రీనాథ్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
ఆకస్మిక తనిఖీ
బయ్యారం: బయ్యారంలో ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సవ్ టొప్పో బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. బయ్యారంలోని బాలుర ఉన్నత పాఠశాలతో పాటు పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి పఠనాశక్తిని పరిశీలించారు. పీహెచ్‌సీలో నమోదవుతున్న వ్యాధుల వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంఈఓ దేవేంద్రాచారి తదితరులు ఉన్నారు.
ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో