
దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి
గూడూరు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) కె. అనిల్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూభారతి రెవెన్యూ సదస్సుల రిజిస్టర్లను పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట సర్వే సక్రమంగా చేయాలని సూచించారు.
తహసీల్ సందర్శన..
కేసముద్రం: ఇనుగుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ అనిల్‌కుమార్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. భూభారతి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన 1,684 దరఖాస్తులలో సరైన పత్రాలు ఉండి, ఆమోదయోగ్యమైనవి కలెక్టర్‌కు పంపించాలని సూచించారు. ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తరంగిణి, ఆర్‌ఐ బషీర్, సిబ్బంది పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ కె.అనిల్‌కుమార్