
రామప్ప హుండీ ఆదాయం రూ.5.58 లక్షలు
వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప దేవాలయానికి గత మూడు నెలలల్లో రూ.5,58,506 హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. గత మూడు నెలలుగా భక్తులు, పర్యాటకులు హుండీలో వేసిన కానుకలను మంగళవారం లెక్కించారు. దేవాదాయశాఖ పరిశీలకులు కవిత ఆధ్వర్యంలో శ్రీభ్రమరాంబిక సేవా సమితి సభ్యులు హుండీ కానుకలను లెక్కించారు. కార్యక్రమంలో ఆలయ ఆర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పరమశివుడి అలంకరణలో
రామలింగేశ్వరస్వామి
రామప్ప దేవాలయంలోని రామలింగేశ్వరస్వామి మంగళవారం పరమశివుడి అలంకరణలో పర్యాటకులకు, భక్తులకు దర్శనమిచ్చినట్లు ఆలయ ప్రధాన ఆర్చకుడు కోమల్లపల్లి హరీశ్‌శర్మ తెలిపారు. శ్రావణమాసం సందర్భంగా రామలింగేశ్వరస్వామికి రోజుకో అలంకరణ చేస్తున్నట్లు వెల్లడించారు.

రామప్ప హుండీ ఆదాయం రూ.5.58 లక్షలు