
ఎదురుచూపులు
బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 10లోu
సాక్షి, మహబూబాబాద్: ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలతో బిడ్డలను కనలేని తల్లిదండ్రులు పిల్లలను దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. మారిన పరిస్థితులు, చట్టాల అమలు నేపథ్యంలో దొడ్డిదారిన కాకుండా రాజమార్గంలో దత్తత తీసుకునేందుకు దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కాగా జిల్లాలో ఆడపిల్లలు కావాలని ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. అయితే నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్న మూడేళ్ల తర్వాత ఆడపిల్లలను దత్తత ఇస్తారు. దీంతో దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
గతంలో గుట్టుచప్పుడు కాకుండా..
గతంలో పిల్లలను గుట్టుచప్పుడు కాకుండా దత్తత తీసుకునేవారు. ఈమేరకు మహబూబాబాద్, కురవి, తొర్రూరు, బయ్యారం మండలాలకు చెందిన పలు శిశు విక్రయాలు, అక్రమ దత్తతపై ఇప్పటికే కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, వైద్యారోగ్య, పోలీసు మొదలైన శాఖలు సమన్వయంతో శిశువిక్రయాలు, అక్రమ దత్తతపై నిఘా పెట్టాయి. ప్రధానంగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మరో కాన్పుకోసం ఎదురుచూసే తల్లిదండ్రులు, పోక్సో కేసుల్లో గర్భిణులు, ఇతర కారణాల వల్ల గర్భం దాల్చిన వారిపై దృష్టి పెట్టారు. ఇందుకోసం ఏఎన్‌ఎం, ఆశవర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లను సమన్వయం చేయడంతో గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం జరిగే వరకు పర్యవేక్షించి పుట్టిన బిడ్డను తీసుకొని శిశుగృహకు సరెండర్ చేస్తున్నారు.
అమ్మా అని పిలిపించుకోవాలని..
అమ్మా అని పిలిపించుకోవాలనే తపనతో ఏదోరకంగా శిశువును తెచ్చుకొని పెంచుకునే సందర్భంలో వచ్చే సమస్యలతో ఇబ్బంది పడడం కన్నా రాజమార్గంలో దత్తత తీసుకునేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. కాగా, జిల్లాలో దత్తత కోసం సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) వెబ్‌సైట్‌లో 2015 నుంచి ఇప్పటివరకు 60 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 19 మంది దంపతులు 22 మంది పిల ్లలను తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా నుంచి 31 మంది వెయిటింగ్‌లో ఉన్నారు. కారా నిబంధనల ప్రకారం దత్తత తీసుకునే తల్లిదండ్రులు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, ఆర్థికంగా యోగ్యత కలిగి ఉండాలి. ప్రాణాంతకమైన వైద్య పరిస్థితి ఉండకూడదు, నేర చరిత్ర లేకుండా ఉండాలి. సింగిల్ పేరెంట్ పురుషుడు అయితే ఆడపిల్లను దత్తత ఇవ్వరు. శిశువుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెరిగే విధంగా రూపొందించిన నిబంధనల మేరకు దత్తత ఇస్తారు.
జిల్లా నుంచి ఎక్కువ పిల్లల సరెండర్..
రకరకాల పరిస్థితుల్లో పిల్లలను పెంచుచోలేని కుటుంబాల నుంచి పిల్లలను సేకరించి శిశుగృహాలకు తరలించడంలో మహబూబాబాద్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. బాలల పరిరక్షణ విభాగం, అంగన్‌వాడీ, ఆశవర్కర్లు, ఏఎన్‌ఎం ద్వారా ప్రతీ గ్రామంలో పిల్లలు వద్దనుకున్న, అక్రమ దత్తత తీసుకున్న వారిని గుర్తించి.. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి 2018 నుంచి ఇప్పటి వరకు 38 మందిని సరెండర్ చేసుకున్నారు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో వారిని కారా పోర్టల్ ద్వారా దత్తతకు పంపించారు. ఇలా జిల్లా నుం,ఇ సేకరించిన పిల్లలను ఇతర ప్రాంతాలకు దత్తత ఇవ్వడం, జిల్లాకు నుంచి వచ్చిన దరఖాస్తు దారులకు ఇతర ప్రాంతాల పిల్లలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే దత్తత తీసుకునేందుకు వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ శాతం ఆడపిల్ల కావాలని వచ్చినవి ఉండడంతో దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
నిబంధనల మేరకు దత్తత..
పిల్లలు అవసరం లేదు అనుకునే వారు సమీపంలోని అంగన్‌వాడీ టీచర్, ఆశవర్కర్లకు చెబితే చాలు శిశువును తీసుకెళ్లి శిశుగృహంలో అన్ని వసతులతో పెంచుతాం. కారా నిబంధనల మేరకు దత్తత ఇస్తాం. శిశు విక్రయాలు, ఇతర మార్గాల ద్వారా దత్తత తీసుకోవద్దు. భార్యాభర్తల అంగీకారంతో దత్తత కోసం దరఖాస్తు చేసుకుంటే అన్ని అర్హతలను పరిశీలించి రాజమార్గంలో శిశువును తీసుకెళ్లి పెంచుకోవచ్చు.
– శిరీష, డీడబ్ల్యూఓ
న్యూస్‌రీల్
పిల్లల దత్తత కోసం దరఖాస్తులు
ఆడపిల్లలు కావాలని అధికంగా వినతులు
‘కారా’ నిబంధనల మేరకు ప్రక్రియ
దరఖాస్తుదారులకు తప్పని నిరీక్షణ
శిశువిక్రయాలపై ప్రత్యేక నిఘా
దత్తత తీసుకునే వారి వయసు, పిల్లల వయసు వివరాలు
పిల్లల వయసు భార్యాభర్తలిద్దరిది కలిపి సింగిల్ పేరెంట్
0– 2 సంవత్సరాలు 85 సంవత్సరాలు 40 సంవత్సరాలు
2–4 సంవత్సరాలు 90 సంవత్సరాలు 45 సంవత్సరాలు
4–8 సంవత్సరాలు 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు
8–18 సంవత్సరాలు 110 సంవత్సరాలు 55 సంవత్సరాలు

ఎదురుచూపులు

ఎదురుచూపులు