
నాణ్యమైన సేవలు అందించాలి
● అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్
మహబూబాబాద్: వినియోగదారులకు నా ణ్యమైన, వేగవంతమైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. అదనపు చార్జీలు వసూళ్లు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పిదాలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. దరఖాస్తుదారులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. సమావేశంలో ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకాంత్, సిబ్బంది రఘుపతి, రాకేశ్ శర్మ, అశోక్ కుమార్, మీసేవ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.
పీఆర్‌టీయూ పోరాటాలతోనే
పదోన్నతుల ప్రక్రియ
గార్ల: పీఆర్‌టీయూ పోరాటాల ఫలితంగా రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మిర్యాల సతీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పలు పాఠశాలల్లో చేపట్టిన పీఆర్‌టీయూ సభ్యత్వ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో చేపట్టే ధర్నాలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు చింతనిప్పు రమేశ్, ప్రధాన కార్యదర్శి మహమూద్ అలీ, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ సురేందర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, రమేశ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పౌష్టికాహారం
అందించాలి
మహబూబాబాద్: సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర కార్యదర్శి అలుగు వర్షిణి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌నుంచి ఆమె సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో డైట్ కమిటీలు తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అలుగు వర్షిణి మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా భోజనం, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. వీసీలో జిల్లా నుంచి ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ
చైర్మన్ ధర్మారావు
కేసముద్రం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 11ఏళ్లుగా సాధించిన ప్రగతి, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు అన్నారు. మంగళవారం కేసముద్రంలో మహాసంపర్క్ అభియాన్‌లో భాగంగా ఇంటింటికీ బీజేపీ– ప్రతీ ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్మారావు మాట్లాడారు. ప్రధాని మోదీ పాలనలో సాధించిన విజయాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచందర్‌రావు, మండల అధ్యక్షుడు రమేశ్, జి ల్లా కౌన్సిల్ మెంబర్ నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరాచారి, నాయకులు వెంకట్‌రెడ్డి, ఉపే ందర్, మధుకర్, మహేందర్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.

నాణ్యమైన సేవలు అందించాలి

నాణ్యమైన సేవలు అందించాలి