
● ఆదరణ లేని ‘ఆకాంక్ష’..
కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్న దుకాణాలు
జిల్లాలోని స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను ఆకాంక్ష పేరుతో జిల్లా కేంద్రంలోని తొర్రూరు బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేశారు. ఆదివాసీ కళాకారులు, గ్రామీణ పారిశ్రామికులు తయారు చేసిన జనపనార సంచులు, తేనె తదితర గిరిజన ఉత్పత్తులను ప్రదర్శించడం, అమ్మకాలు జరపడంతో పాటు ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన స్టాళ్లకు ఆదరణ కరువైంది. పూర్తిస్థాయిలో స్టాళ్లను ఏర్పాటు చేయడంలో సంబంధిత శాఖ అధికారులు విఫలమయ్యారు. అంతేకాక ఏర్పాటు చేసిన స్టాళ్లకు కూడా సరైన ప్రచారం లేక వెలవెలబోతున్నాయి.
– సాక్షి, స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్