
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ మల్లారెడ్డి, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్దోజు కవిత డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అదే బాటలో ప్రస్తుత ప్రభుత్వం నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా.. సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం లేదన్నారు. పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ఇప్పటికై నా సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 23న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధన్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. విద్యావ్యవస్థలో పర్యవేక్షణను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు.