
సద్వినియోగం చేసుకోవాలి
తొర్రూరు: ప్రభుత్వ జూనియ ర్ కళాశాలల్లో ఉచిత విద్య, పు స్తకాలు అందిస్తున్నామని, వి ద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్మీడియట్ బో ర్డు జాయింట్ సెక్రటరీ వసుంధర దేవి అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన ఆమె రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేర్పించాలని కోరారు. డోర్ టు డోర్ ప్రచారం ద్వారా అడ్మిషన్లు పెంచాలని అధ్యాపకులకు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అరుణ, అధ్యాపకులు నారాయణ, సువర్ణ, ఉప్పలయ్య, నర్సయ్య, మల్లయ్య, రాజేశ్, అనిత, అలీ పాల్గొన్నారు.