
ఉధృతంగా పాకాలవాగు
గూడూరు: ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మండల కేంద్రం సమీపంలోని నెక్కొండ– కేసముద్రం రహదారిలోని పాకాలవాగు సోమవారం ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్రిడ్జికి ఆనుకొని నీటి ప్రవాహం కొనసాగుతోంది.
నీట మునిగిన పంటపొలాలు
కేసముద్రం: మండలంలోని నారాయణపురం, ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పంటపొలాలు నీట మునిగాయి. ఈ ప్రాంతంలో చేపడుతున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా నారాయణపురంలో చెరువు నుంచి వెళ్లే వరద నీటి ప్రవాహం వద్ద కల్వ ర్టు నిర్మించాల్సి ఉండగా అడ్డుగా రోడ్డు నిర్మాణం చేపట్టడంతో వరదనీరు పొలాల్లోకి చేరింది. సుమా రు 30 ఎకరాల్లో పొలాలు నీటమునగడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కోమటిపల్లిలో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా కల్వర్టు చిన్నగా నిర్మించడంతో వరదనీరంతా చుట్టు పక్కల పంటపొలాలకు చేరడంతో నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.

ఉధృతంగా పాకాలవాగు