
వినతులపై వెంటనే స్పందించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతులపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, అనిల్‌కుమార్ వినతులను స్వీకరించారు. ఈసందర్భంగా లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. పరిష్కారం సాధ్యం కాకుంటే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలని అన్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం మొత్తం 130 వినతులు వచ్చిన్నట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వినతులు ఇలా..
● కొత్తగూడెం మండలం ఓటాయికి చెందిన సంగీత తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.
● నెల్లికుదురు మండలం రావిరాల గ్రామానికి చెందిన దివ్యాంగుడు గుండె వెంకన్న తనకు చార్జింగ్ సైకిల్ ఇప్పించాలని కోరాడు.
● గార్ల మండలం బుద్దారం గ్రామానికి చెందిన భూక్యా రాందాస్ 2020లో సీతారామ ప్రాజెక్ట్‌లో తన భూమి కోల్పోయినా.. పరిహారం రాలేదని ఇప్పించాలని వినతి పత్రం అందజేశారు.
● గార్ల మండలం మర్రిగూడేనికి చెందిన బానోత్ నవీన్ తన భూమి కొందరు ఆక్రమించుకుని అక్రమంగా పట్టాచేయించుకున్నారు. దీంతో పట్టా రద్దు చేసి న్యాయం చేయాలని కోరాడు.
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్‌టొప్పో
ప్రజావాణిలో 130 వినతులు