
ఉత్సాహంగా చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీరామ్‌లైఫ్ ఇన్సూరెన్స్ సహకారంతో హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం ఓపెన్ టు ఆల్ ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చదరంగ(చెస్) పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 50 మంది క్రీడాకారులు హాజరైనట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి. కన్నా తెలిపారు. సాయంత్రం వరకు సాగిన పోటీల్లో మొదటి మూడు రౌండ్లు ముగిసే సరికి షేక్‌రియాజ్, అభినవ్‌సాయి దామెర, నరిగె యశ్వంత్, రామా రిషిత్‌కుమార్ ముందంజలో ఉన్నట్లు తెలిపారు.