
177 మంది చిన్నారులకు విముక్తి
ఆపరేషన్ ముస్కాన్ ద్వారా
వరంగల్ క్రైం : ఆపరేషన్ ము స్కాన్ 11వ విడత ద్వారా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న 177 మంది చిన్నారుల కు విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు బాలల సంరక్షణ వి భాగం, చైల్డ్ లైన్, కార్మిక శాఖతో కలిసి ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జి ల్లాల్లో వివిధ ప్రాంతాల్లో సంయుక్తంగా తనిఖీలు ని ర్వహించారన్నారు. ఇందులో బాల కార్మికులు, బడి మానేసిన 177 మంది బాలబాలికలను గుర్తించి వా రిని బాలల సంరక్షణ గృహానికి పంపించినట్లు సీపీ తెలిపారు. ఇందులో 149 మంది బాలలు, 28 మంది బాలికలు ఉన్నారన్నారు. బాలల సంరక్షణ గృహా నికి తరలించిన వారిలో తెలంగాణ , ఇతర రాష్ట్రాలకు చెందిన 97 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. మిగతా ఆరుగురిని వారి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. చిన్నారులను పనిలో పెట్టుకున్న యజమానులకు రెండేళ్ల జైలు శిక్ష,రూ. 50 వేలు జరిమానా విధిస్తామన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్