
ఘనంగా తీజ్ వేడుకలు
కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ పరిధి సబ్‌స్టేషన్‌తండాలో గురువారం గిరిజనులు తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ హాజరై గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సాంస్కృతిక వైభవానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. అంతకు ముందు తాళ్లపూసపల్లిలో రూ.10లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులు, కేసముద్రంస్టేషన్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా సురేష్‌నాయక్, బండారు వెంకన్న, బాదావత్ పవన్ నాయక్, పోలెపాక నాగరాజు, ఎండీ.అయూబ్‌ఖాన్, బాలునాయక్, తరాల వీరేష్, బీల్యానాయక్, సాంబయ్య పాల్గొన్నారు.
హాజరైన ఎమ్మెల్యే మురళీనాయక్