
నేరాల నియంత్రణే లక్ష్యం
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
మహబూబాబాద్ రూరల్: నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసు అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు సాంకేతిక ఆధారాలతో కూడిన ఆధునిక పద్ధతులను అమలు చేయాలని, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నా రు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడానికి కేసులను దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో వేగవంతమైన విచారణ జరపాలన్నారు.సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, లోన్ యాప్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే తగిన కార్యాచరణ ప్రారంభించాలన్నారు. ఉత్తమ పనితీరు కనబరచిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసపత్రాలు అందజేశారు. డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ శ్రీని వాస్, ఎస్బీ, డీసీఆర్బీ, సీసీఎస్ సీఐలు చంద్రమౌళి, సత్యనారాయణ, హతీరాం ఎస్సైలు పాల్గొన్నారు.