
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
బయ్యారం: ప్రజాపాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మండల కేంద్రంలోని గురువారం నూతన రేషన్‌కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇంటితో పాటు రేషన్‌కార్డులు వస్తాయని, ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. పేదల నుంచి సంపన్నుల వరకు ఒకే రకమైన బియ్యం తినాలనే ఉద్దేశంతో రేషన్‌షాపుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.