
క్రమశిక్షణతోనే అత్యున్నత స్థాయికి..
హసన్‌పర్తి : క్రమశిక్షణతోనే అత్యున్నత స్థాయికి చేరుకుంటారని ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్‌లర్ ఎ.వరదారెడ్డి అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ ప్రవేశం పొందిన బీటెక్ విద్యార్థులకు బుధవారం ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరదారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విజయం కోసం సులువు మార్గాలు ఉండవన్నారు. విద్యార్థులు కష్టపడి చదివితేనే లక్ష్యం సాధ్యమన్నారు. యూనివర్సిటీ వీసీ దీపక్ గార్గ్ మాట్లాడుతూ నాలుగేళ్ల విద్యాకాలంలో స్వీయ అభివృద్ధి–స్వీయ పరిచయంపై దృష్టిసారించాలన్నారు. కరికులం సంస్కరణలు, పరీక్ష విధానంలో మార్పులు, ఎలక్టివ్ ఛాయిస్‌లు, గేమిఫికేషన్, మెంటరింగ్ విధానాల గురించి వివరించారు. ఎస్సార్ యూనివర్సిటీలో ఓపెన్ డోర్ పాలసీ అమలులో ఉందన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అర్చనారెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ వి.మహేశ్, డాక్టర్ రామ్‌దేశ్‌ముఖ్, డైరెక్టర్లు శేషగిరావు, శరత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్‌లర్
వరదారెడ్డి