
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలి
మహబూబాబాద్ అర్బన్ : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం పట్టణ అధ్యక్షుడు వెన్నెమల్ల అజయ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాంనాయక్ మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. దేశంలో మోదీ పాలనలో చేపట్టిన అభివృద్ధిని చూసి గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఓట్లు వేస్తున్నారన్నారు. ఇటీవల ఉపముఖ్యమంత్రి మానుకోటకు వచ్చినా ప్రజలకు ఏం ఒరిగిందని, తాను ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే ప్రస్తుతం కనబడుతుందన్నారు. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మానుకోటను అందంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శ్యామ్ సుందర్ శర్మ, నాయకులు పల్లె సందీప్, ఓర్సు పద్మ, టౌన్ జనరల్ సెక్రటరీ ధరావత్ రవికుమార్, రవి యాదవ్, నరేష్ నాయక్, సరోజ, హతీరాం, భరత్, శ్యామ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్