
కాళేశ్వరం పంపుహౌస్ సందర్శన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లక్ష్మీపంపుహౌస్‌ను కేంద్ర సర్వీస్ ట్రైనీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ (ఏఎస్‌ఓ) బృందం సందర్శించింది. గురువారం కాళేశ్వరం పరిధిలోని రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవనశాఖలపై క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని డెలివరీ చానల్ వద్ద ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. మోటార్ల పనితీరు, టీఎంసీల తరలింపు, నీటి వినియోగం, విద్యుత్ వినియోగంపై ఇంజనీర్ల ద్వారా తెలుసుకున్నారు. వారివెంట కార్యదర్శి సత్యనారాయణ ఉన్నారు.