
వంశీ(ఫైల్)
పాలకుర్తి టౌన్: ఇంటర్మీడియట్ పరీక్షలో మరోసారి ఫెయిల్ అవుతానేమోనని భయంతో ఓ విద్యార్థి మనస్థాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై సాయి ప్రసన్నకుమార్ కథనం ప్రకారం పాలకుర్తికి చెందిన ఈరంటి వంశీ(19) గత సంవత్సరం సంవత్సరం ఇంటర్మీయట్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. ఇంటి వద్ద ఉంటూనే ఇటీవల సప్లిమెంటరీ పరీక్ష రాశాడు. అయితే ఇందులో కూడా ఫెయిల్ అవుతానేమోననే భయంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్నున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, బుధవారం రాత్రి వరకు స్నేహితులతో కలిసి ఉండి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసి అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహ్యకు పాల్పడినట్లు సమాచారం.