ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టాలి
నెహ్రూసెంటర్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ధాన్యం కొనుగోళ్లు, వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. శీతా కాలం సందర్భంగా జిల్లాలోని అన్ని వసతి గృహాలను అధికారులు తనిఖీ చేయాలని సూచించా రు. పిల్లలకు సరిపడా దుప్పట్లు, మానసిక ,ఆరోగ్య పరిస్థితులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ ఉపాధ్యాయులు ప్రత్యేక డిజిటల్ తరగతులు నిర్వహించాలని తెలిపారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కె.అనిల్‌కుమార్, డీఆర్డీఓ ప్రాజెక్టు డైరెక్టర్ మధుసూదన్‌రాజు, ఏడీ ఎస్‌ఎల్‌ఆర్ నరసింహామూర్తి, డీఏఓ విజయనిర్మల, సవిల్‌సప్లయీస్ డీఎం కృష్ణవేణి, డీఎస్‌ఓ రమేష్, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.


