గ్రానైట్ రాళ్లపై గ్రైండింగ్‌తో ఇబ్బందులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయిపరిచే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కమ్రంలో ఆ రాళ్లపై గీతలు, ఎత్తువంపులు తొలగించడానికి గ్రైండింగ్ పనులు చేస్తుండడంతో దుమ్ము ఎగిసిపడుతోంది. గ్రైండింగ్ పనులతో గురువారం అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్న క్రమంలో భక్తులు దుమ్ముతో ఇబ్బందులు పడ్డారు. పనులు నిర్వహిస్తున్న సమయంలో నీటి స్ప్రే చేయకుండా గ్రైండింగ్ చేపట్టడమే కారణమని భక్తులు అంటున్నారు. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఈ పనులు చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ముతో శ్వాసకోశ సమస్యలు కూడా వ్యాపిస్తాయని భక్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి దుమ్ము రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


