మహానంది కిటకిట | - | Sakshi
Sakshi News home page

మహానంది కిటకిట

May 19 2026 1:28 AM | Updated on May 19 2026 1:28 AM

మహానంది: వేసవి సెలవులు కావడంతో మహానంది క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు స్థానిక కోనేరులలో పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. పరమేశ్వరుడికి ప్రీతికరమైన సోమవారం కావడంతో ఒకే రోజు 30కి పైగా అభిషేకాలు, 40కి పైగా క్షీరాభిషేకాలు జరగగా ఆర్జిత సేవా టిక్కెట్లతో పాటు లడ్డు, పులిహోర ప్రసాదాల విక్రయాలు, వసతి గృహాలు, తదితర విభాగాల ద్వారా ఆలయానికి ఒకే రోజు లక్షల్లో ఆలయం సమకూరింది. మహానంది మండల విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ ప్రభాకర్‌రెడ్డి దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద విభాగానికి రూ.10,116 విరాళం చెల్లించారు.

Advertisement
 
Advertisement
Advertisement